Home / Videos / Namitha Hot Ramp Walk from Chennai Fashion Premier Week

Namitha Hot Ramp Walk from Chennai Fashion Premier Week

నమిత.. దక్షిణాది అభిమానుల గుండెల్లో దేవకన్యలా స్థానం కల్పించుకున్న భారీ సొగసుల సుందరి. కెరీర్ ఆరంభంలో చాలా సన్నగా వున్న ఈ అమ్మడు.. స్టార్ హీరోల సరసన భారీ సినిమాల్లో నటించింది. అప్పటి స్టార్ హీరోయిన్ల జాబితాలో నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది కూడా. తెలుగులోకంటే తమిళంలో ఎక్కువగా క్లిక్ కావడంతో.. ఈమెకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. రానురాను ఈమె లావుగా మారుతున్నకొద్దీ ఇంకా ఫాలోయింగ్ పెరిగిందే తప్ప.. ఏమాత్రం తగ్గలేదు. ఒకానొక సందర్భంలో ఈమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే.. తమిళనాటలో ఈమె ఫ్యాన్స్ ఏకంగా విగ్రహాన్ని కట్టేశారు.ఈ స్థాయిలో తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ వుండడంతో తాను లావయ్యానన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మరింత లావవుతూ వచ్చింది. అయితే.. అదే ఆమె కెరీర్‌ని దెబ్బకొట్టింది. ఆ తర్వాత ఆ సినిమాల్లో నటించడం మానేసి.. వెండితెరకు దూరమైంది. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్లలో తళుక్కుమన్న ఈ భామ.. చాలా లావుగా కనిపించింది. మరీ ఇంత లావుగా ఎందుకయ్యారు అంటే.. అందుకు బదులు ఇవ్వలేదు కానీ త్వరలోనే సన్నబడిపోతానని శపథం చేసింది. చెప్పినట్లుగానే చాలాకాలం బాగానే కసరత్తు చేసింది కూడా. అయితే.. ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ అయినట్లు లేవు. అందుకు సాక్ష్యంగా తాజాగా ఆమెకి సంబంధించి విడుదలైన ఫోటోలే నిలిచాయని చెప్పుకోవచ్చు.ఈ ఫోటోల్లో అమ్మడు మళ్లీ తన భారీ అందాలతోనే దర్శనం ఇచ్చింది. చెన్నైలో జరిగిన ఓ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద కనబడి అందరికీ కనువిందు చేసింది. క్రీమ్ కలర్ డ్రెస్‌తో ర్యాంప్ మీద నమిత వయ్యారంగా నడిచిన ఈ అమ్మడు.. క్లీవేజ్ షో కూడా ప్రదర్శించడంతో అక్కడున్న వాళ్లంతా కళ్ళు ఆర్పలేకపోయారు. చాలాకాలం తర్వాత ఈ హాట్ అవతారంలో దర్శనమీయడంతో జనాలు కెవ్వుమంటున్నారు. సినిమాల్లో కాకపోయినా.. కనీసం ఇలాంటి ఈవెంట్లలోనైనా నమిత ఇలాంటి అవతారాల్లో దర్శనమిస్తే చాలని అనుకునేవాళ్ళు లేకపోలేదు. ఏదేమైనా.. నమిత మరోసారి తన భారీ అందాలు ప్రదర్శించి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిపోయింది.

About cinesizzlers

Check Also

Shruti Haasan has Shown the Dots for Bunny

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.